Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకు కన్నా కూతురే బెటరంటున్న మోడీ

ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను మాటలతో చిత్తు చేయడంపైనే దృష్టి పెట్టే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నేడు మహిళా శక్తిపై మాట్లాడారు. మహిళల శక్తిని తక్కువ అంచనా వేయొద్దంటూ, కొడుకు కన్నా కూతురే నయమని వ్యాఖ్యానించారు. ఎందుకంటే, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కొడుకుల కన్నా కూతుర్లే చక్కగా చూసుకుంటారని వివరించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఫిక్కి మహిళా విభాగం వార్షిక సమావేశంలో మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవిత చరమాంకంలో అండగా నిలుస్తాడనుకొన్న కొడుకులు కాడి వదిలేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. అందుకే, మహిళలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గర్భంలో ఉండగానే బాలికా శిశువులను చిదిమేయడం సరికాదని హితవు పలికారు. మహిళల శక్తిసామర్థ్యాల దృష్ట్యా వారి అభ్యున్నతికి తగిన అవకాశాలు కల్పించాలని మోడీ సూచించారు.

More Telugu News